గాయంతో తొలిటెస్టుకు వార్నర్ దూరం!

208
warner
- Advertisement -

ఆసీస్ – భారత్‌ మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను ఆసీస్‌,టీ 20 సిరీస్‌ని భారత్ గెలుచుకోగా టెస్టు మ్యాచ్‌లు ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన వార్నర్ టెస్టు సిరీస్‌కు దూరం కానున్నారు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మొదటి టెస్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్నర్‌ వెల్లడించారు.

బాక్సింగ్‌ డే టెస్టు వరకు ఫిట్‌నెస్‌ సాధిస్తాననే నమ్మకం ఉందని…. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆడలేకపోతున్నానని వెల్లడించాడు. వికెట్ల మధ్య పరుగెత్తడం, మైదానంలో చురుగ్గా కదలడం వంటివి చేయలేకపోతున్నాని తెలిపాడు. ఈనెల 17 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది.

- Advertisement -