- Advertisement -
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురంలో. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ మూవీ నిలవగా సాంగ్స్ కూడా రికార్డు వ్యూస్‌తో అందరిని ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలోని రాములో రాములా సాంగ్ వస్తే స్టెప్పులేయని వారుండరు. తాజాగా ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ పాటకు అదిరే స్టెప్పులేని అలరించాడు.
తన భార్యతో కలిసి టిక్ టాక్‌లో డ్యాన్స్ చేసి సూపర్బ్ అనిపించాడు వార్నర్. ఇంతకముందే ఇదే సినిమాలోని బుట్ట బోమ్మ “బుట్ట బొమ్మ” పాటకు స్టెప్పులేసి ఇరగదీశాడు.
- Advertisement -