బాల్ ట్యాంపరింగ్ క్రికెట్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్ ఆస్ట్రేలియా దోషిగా మిగలాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్,వార్నర్,బాన్ క్రాప్ట్ లపై వేటువేసింది. అంతేగాదు ఈ ముగ్గురిని జట్టు నుండి సస్పెండ్ చేసింది.
తాజాగా బాల్ ట్యాంపరింగ్ దెబ్బకు క్రికెట్ ఆస్ట్రేలియాలో మరో వికెట్ పడింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ పీవెర్ గురువారం ప్రకటించారు. డేవిడ్ స్థానంలో ఎర్ల్ ఎడ్డింగ్స్‌ను ఆపద్ధర్మ చైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ముగిశాక చీఫ్ కోచ్ పదవి నుంచి డారెన్ లెమన్ తప్పుకున్నారు. ఆసీస్ సీనియర్ ఆటగాడు జస్టిస్ లాంగర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమ్స్ సందర్లాండ్ కూడా పదవికి రాజీనామా చేశారు.