డ్రైవర్ నుంచి గొప్ప డైరెక్టర్ వరకూ

586
- Advertisement -

హాలీవుడ్ డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్‌కు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. అయితే, జేమ్స్ కామెరూన్‌ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఏమిటంటే.. ఆయన కరోనా నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నారు. ప్ర‌స్తుతం జేమ్స్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. మరో వారం రోజుల్లో జేమ్స్ కామెరూన్‌ పూర్తి ఆరోగ్యంగా మన అందరి ముందుకు వస్తారని హాలీవుడ్ రిపోర్ట‌ర్ మ్యాగ్జిన్ పేర్కొంది. ఇక లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ అవ‌తార్ ప్రీమియ‌ర్‌కు మాత్రం జేమ్స్ కామెరూన్ దూరంగా ఉండనున్నారు. నిజానికి ఈ ప్రీమియ‌ర్‌కు రావాలని జేమ్స్ కామెరూన్‌ చాలా ఇంట్రెస్ట్ చూపించారు.

కానీ, రొటీన్ టెస్టింగ్ చేస్తున్న స‌మ‌యంలో జేమ్స్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఐతే, కరోనా వచ్చినా అవతార్ 2 ప్రీమియ‌ర్‌ ను మాత్రం మిస్ చేసుకునే పరిస్థితే లేదని.. ప్రీమియ‌ర్‌ లో ఆయన వ‌ర్చువ‌ల్‌ గా పాల్గొంటార‌ని డిస్నీ సంస్థ ప్ర‌తినిధి తెలిపారు. అయినా జేమ్స్ కామెరూన్‌కు పోరాట పటిమ పుట్టుక తోనే వచ్చింది. జేమ్స్ కామెరూన్‌ చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. సహజంగా మనం కొన్ని మూవీస్ చూసి బాగా ఎంజాయ్ చేస్తాము. తర్వాత మర్చిపోతాము. ఐతే, కొన్ని మూవీస్ ను ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే.. ఆ చిత్రాలు చరిత్ర సృష్టిస్తాయి.

అలా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాలను తీశాడు జేమ్స్‌ కామెరూన్‌. ఆయన తెరకెక్కించిన టైటానిక్, అవతార్ లకు ఎవరు మాత్రం అభిమానులు కాకుండా ఉండగలరు. అంత గొప్ప సినిమాలు తీసి, గొప్ప అనుభూతి కలిగించిన జేమ్స్ కామెరూన్‌ గురించి ఒక షాకింగ్ విషయం చెప్పాలి. జేమ్స్ ఒకప్పుడు డ్రైవర్ గా పనిచేశాడు. అవును, మూవీస్ మీద తనకున్న ఆసక్తితో ఇండస్ట్రీలో చిన్నచిన్న పనులు చేస్తూ ఒక గొప్ప డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో అద్భుతమైన మూవీస్ ని అందించి టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -