సరస్వతి పుత్రికకు ఎమ్మెల్సీ కవిత భరోసా..

210
mlc
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. చదువుల తల్లి, పేద విద్యార్థి అయిన హారికకు అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా నాందేవ్‌గూడకు చెందిన హారికకు అండగా నిలిచారు. హారిక ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. హారిక ఎంబీబీఎస్‌లో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించారు హారిక. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -