- Advertisement -
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వివాహం జిగ్నేశ్‌రెడ్డితో గురువారం ఉదయం జరిగింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటుడు పవన్ కళ్యాణ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కేటీఆర్, ఎంపీ బీబీ పాటిల్, సినీ నటుడు చిరంజీవి, రామోజీ రావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మన్ తదితరులు హాజరయ్యారు.
- Advertisement -