జియోకి షాక్….రూ.20కే డేటా సేవలు

247
- Advertisement -

టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో  ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది.ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ముగుస్తున్న వేళ చివరి క్షణాల్లో ఆర్‌జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును మరో 15 రోజులు పెంచింది. అంటే ఏప్రిల్ 15 వరకు సభ్యత్వాన్ని పొందవచ్చు. ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును పెంచడంతోపాటు జియో మరో ఆఫర్ కూడా ప్రకటించింది.

జియో గతంలో ప్రకటించిన రీచార్జ్ ప్లాన్లను బట్టి రూ.303తో రీచార్జ్ చేసుకుంటే నెల రోజులపాటు మాత్రమే అపరిమిత వాయిస్ కాల్స్, డేటా సేవలు లభించేవి. ఇప్పుడు దానిని మూడు నెలలకు పెంచింది. అంటే ఒకసారి రూ.303తో రీచార్జ్ చేసుకుంటే జూన్ చివరి వరకు ఉచిత సేవలు పొందవచ్చన్నమాట.

DataWind to invest Rs 100 crore after FIPB nodమరోవైపు వివిధ టెలికాం కంపెనీలు సైతం తక్కువ టారీఫ్‌లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలకు షాకిచ్చేందుకు కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటా విండ్ సిద్ధమైంది.

ఇప్ప‌టికే బడ్జెట్‌ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్‌టాప్‌లు ఇస్తోన్న డేటా విండ్ 3G,4G సర్వీసులను అందించేందుకు సిద్దమైంది. ఇండియ‌న్ టెలికాం బిజినెస్‌లోకి ముందుగా రూ.100 కోట్ల పెట్టుబ‌డుల‌తో ఎంట్రీ ఇస్తోంది. ఇందుకోసం దేశ‌వ్యాప్తంగా ప‌ర్చువ‌ల్ నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌రింగ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసింది. మొదటి ఆరు నెలలపాటు సంవ‌త్స‌రానికి రూ.200 లతో డాటా సర్వీసులను అందించనుంది.

నెలకు రూ.20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్లు అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు డేటావిండ్ ప్లాన్ చేస్తోంది. నెలకి రూ.20 లేదా సంవ‌త్స‌రానికి రూ.200 లకుమించకుండా ఉండేలా యోచిస్తోంది. ఇప్పటికే డాటా విండ్ హైదరాబాద్‌లో మొబైల్,ట్యాబ్ లెట్ తయారీ పరిశ్రమను స్ధాపించిన సంగతి  తెలిసిందే.

- Advertisement -