గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన చీఫ్ విప్‌ దాస్యం

139
dasyam
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా టీఆర్ఎస్వీ కేయు అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో దాస్యం దంపతులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్,వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ హంగు ఆర్భాటాలకు తావులేకుండా సీఎం కేసీఆర్ హరిత హారం స్పూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటామని వినయ్ భాస్కర్ తెలిపారు..

మానవాళికి మనుగడకు,పర్యావరణ పరిరక్షణకు నిరంతరం మొక్కల పెంపకం జరగాలని,సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు హరితహారం,గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుందని ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన, ఆత్మీయ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు,బంధుమిత్రులందరికీ ,విద్యార్థులకు చీప్ విప్ వినయ్ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -