- Advertisement -
సుప్రీంకోర్టు కూడా కులగణన మీద డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ..కానీ కమిషన్ ఏర్పాటు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి..సెన్సస్ పేరుతో మోసం చేసి, బీసీల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
కులగణనపై హైకోర్టు ఆదేశాలు అందలేదని బీసీ కమిషన్ చైర్మన్ చెప్పడం దుర్మార్గం అన్నారు. రేవంత్ చెప్పుచేతల్లో బీసీ కమిషన్ పని చేస్తుందన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, 342ల ప్రకారం బీసీల కులగణనను పకడ్బందీగా చేయాలి… లీగల్ గా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అఖిలపక్ష సమావేశం, అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి కులగణనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
Also Read:సంక్రాంతి రేసులో వెంకీ!
- Advertisement -