6:15నిమిషాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెడతాం అని ఒక్క నోటు ఇచ్చారు…భారత రాజ్యాంగంతో నిర్మితమైన సంస్థ…రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం కుర్చీలో కూర్చున్న వారికి ఉంటుంది అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.రాజ్యాంగ బద్ధమైన సంస్థ రేవంత్ జేబు సంస్థ గా మారిపోయింది…ఆగమేఘాల మీద ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెడుతున్నారు అని మేము భావిస్తున్నాం అన్నారు.
ఒక్కవేళ ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని అనుకుంటే దయచేసి ఆపండి…ప్రజలను మోసం చేసి కోట్లు కోట్లు ఖర్చు చేసి బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి.బీసీలను నయవంచన చేశారు…ప్రజలను తడి గుడ్డతో గొంతు కోసినట్టు ఉంటుంది.ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇస్తే ప్రజల గొంతు కోసేందుకు కత్తి ఎన్నికల సంఘం ఇచ్చినట్టే అవుతుంది అన్నారు.
జివో ఏం ఎస్ 9 ను ఇచ్చారు.బిల్లులు అన్ని కూడా రాష్ట్రపతి కార్యాలయం లో పెండింగ్ లో ఉన్నాయి…ఈ జివో తో 42 శాతం రిజర్వేషన్ల పై ఇచ్చారు.ఈ జివో పై హైకోర్టు కు వెళ్ళారు కొందరు.ఈ జివో ను హైకోర్టు స్టే చేసింది.హైకోర్టు లో స్టే రాగానే సుప్రీంకోర్టు కు వెళ్లింది ప్రభుత్వం అక్కడ కూడా ఇదే తరహా స్టే వచ్చింది.వచ్చే నెల 12నాడు తుది తీర్పు ఉన్నది.ఆ తీర్పు లో ప్రభుత్వం వాదన ను ఒప్పుకుంటే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి.చరిత్రలో నిలిచిన రోజు అవుతుంది అన్నారు.
హైకోర్టు లో పెండింగ్ ఉన్నది ఈ కేసు…హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న కేసు ఉండగా ఆగమేఘాల మీద షెడ్యూల్ ఎందుకు .జివో 46 ఆధారంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇస్తున్నారు అని అంటున్నారు.వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. రిజర్వేషన్ల రోస్టర్ లో ఎక్కడ కూడా బీసీలకు 20శాతం రిజర్వేషన్ల అమలు కాలేదు.
42శాతం రిజర్వేషన్ల పై మాట్లాడకుండా పాత రిజర్వేషన్ల పై జివో తెచ్చారు.డ్రామా ఏమైనా చేస్తున్నారా…. సినిమా నడుపుతున్నారా.రాజ్యాంగమా ఇది డ్రామా.ఒక్క రిపోర్ట్ కూడా బయటకు రాలేదు ..క్షణాల్లో బుసాని కమీషన్ రిపోర్ట్ ఇస్తారంట అప్పటికప్పుడు జివో 46 తెస్తారట.రాజ్యాంగం అంటే భక్తి భయం లేదా.పాలకుడికి భయం భక్తి ఉండాలి.200కోట్లు ఖర్చు చేశారు.ఏమైంది..పాలాభిషేకం,పులభిషేకం చేయించుకుంటివి అన్నారు.
రేవంత్ గౌడ్ ఆంటీవి,రేవంత్ ముదిరాజ్ అంటిరి ఏమైంది ఇప్పుడు…డిసెంబర్ 12నాడు బీసీలకు రిజర్వేషన్లు పై హైకోర్టు లో తీర్పు అనుకూలంగా వస్తుంది కావచ్చు.ఎందుకు ఈ హడావుడి ..ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేయాలి.ఎస్సీ,ఎస్టీలకు 2011జనాభా లెక్కల ప్రకారం అంటారు.బీసీలకు మాత్రం 2024అంటారు.ప్రభుత్వ పెద్దలకు బుద్ధి లేదు….అధికారులకు కూడా బుద్ధి లేదా.12రోజులు ఆగితే భూమి బద్దలు అవుతాయా….కిరీటం కింద పడుతుందా,మీ అడ్వకేట్ సింగ్వి చెప్తున్నాడు కదా 42 శాతం సాధ్యం అవుతుంది అని.రేవంత్ రెడ్డి వినడు అతను మూర్ఖుడు .ఎన్నికల సంఘం వినాలి.మానవత్వం తో ఆలోచన చేయాలి ఎన్నికల సంఘం.ఇది రాజ్యాంగం కాదు,ఇది ఇల్లీగల్.షెడ్యూల్ విడుదల చేసే ముందు ఆలోచన చేయాలి అన్నారు.
Also Read:TG:కేబినెట్ కీలక నిర్ణయాలివే

