రియల్ ఎస్టేట్ కోసం HCU విధ్వంసం:దాసోజు

0
- Advertisement -

బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ , కేటీఆర్ ల ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశాం అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, మానవత్వం లేకుండా కర్కషత్వం తో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు…. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో 400 ఎకరాలను విద్వంసం చేస్తున్నారు అన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం యూనివర్సిటీని విధ్వంసం చేస్తున్నారు అన్నారు.

భూములను కాపాడుతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.. భారత జాతీయ పక్షి నెమళ్ళు కాపాడమని అరుస్తున్నాయి అన్నారు. సుప్రీం కోర్టులో hcu భూములు గెలవగానే.. వాటిని తాకట్టు పెట్టీ 20 వేల కోట్లు అప్పు తెచ్చారు సీఎం.. శత్రుదేశాల పై యుద్ధం చేసినట్లు.. hcu పై రాష్ట్రప్రభుత్వం దాడి చేస్తోంది అన్నారు. సీఎం రేవంత్ నీచంగా వ్యవహరిస్తున్నారు అన్నారు.

ఒక జింకను చంపితే ఐదేళ్ల శిక్ష సల్మాన్ ఖాన్ కు పడితే…. వందల నెమళ్ళు, జింకలు చంపుతున్న రేవంత్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడాలి చెప్పాలన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.. యూనివర్సిటీ విద్వంసం పై రాహుల్ గాంధీ స్పందించాలి అన్నారు. రేవంత్ రెడ్డి రాజ్యంలో నోరులేని మృగాలు, పేదలు బ్రతకొద్దా చెప్పాలన్నారు.

Also Read:HCU ఘటనపై రాజ్యసభలో సురేష్ రెడ్డి

- Advertisement -