రేవంత్ రెడ్డి ఫాసిస్ట్ రాజ్యాంగం!

6
- Advertisement -

సింగరేణి బొగ్గు గనుల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను, దోపిడీని ధైర్యంగా బయటపెట్టినందుకే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న బాల్క సుమన్‌తో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడిన దాసోజు శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

సింగరేణిలో జరుగుతున్న అవినీతిని, ప్రభుత్వ పెద్దల అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టినందుకు ప్రతికారంగానే బాల్క సుమన్‌ను టార్గెట్ చేశారని శ్రవణ్ విమర్శించారు. ప్రభుత్వంపై వచ్చే ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేక, భయంతోనే ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

బహిరంగ సభల్లో నిత్యం అసభ్య పదజాలంతో, బూతులతో విరుచుకుపడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, అలాగే అదే బాటలో నడుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమైతే, అసభ్యంగా మాట్లాడే కాంగ్రెస్ నాయకులను కూడా వెంటనే అరెస్ట్ చేసి జైళ్లకు పంపాలని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలు కావడం లేదు. ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి రాసిచ్చిన ఫాసిస్ట్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోంది అని దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.

Also Read:టీఎంసీపై అధిర్ రంజన్‌ ఫైర్

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును, ప్రశ్నించే గొంతులను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తోందని ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. బాల్క సుమన్‌కు పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఈ అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

- Advertisement -