- Advertisement -
ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు(75) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత నాలుగురోజులుగా ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాసరికి ఐసీయూలో చికిత్స అందుతుందని వైద్యులు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. దాసరి అన్నవాహిక దెబ్బతినడంతో గొంతు నుంచి జీర్ణాశయం వరకు వైద్యులు చికిత్స అందించారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఈ రోజు సాయంత్రం ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. రాత్రి 7 గంటలకు ఆయన గుండె పనిచేయడం మానేసిందని, దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని కిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన బులెటిన్‌ను బుధవారం విడుదల చేయగలమని అన్నారు.
- Advertisement -