యుకేలో ఘనంగా దసరా సంబురాలు..

118
tauk
- Advertisement -

తెలంగాణ పూల పండుగైన బతుక‌మ్మ వేడుక‌లు ఐలెస్బరీ(Aylesbury), UK, లో ఘనంగా నిర్వహించారు. ఐలెస్బరీ తెలుగు సంఘం(ATC) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా వేడుకలకు అంచనాలకు మించి 400 మంది హాజ‌ర‌య్యారు. అక్టోబరు 16వ తేదీన మధ్యానం 4 గంటల సమయం నుండి రాత్రి 10 గంటల సమయం వరకు కనుల పండుగగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.వేడుకలో ఐలెస్బరీకి కొత్తగా ఎన్నికైన తెలుగు కౌన్సిలర్స్ హిమ బిందు గుండపుడి, ఫణిందర్ కొయ్య మరియు జాన్ ఎండ్రపాటి లను సన్మానించడం జరిగింది.

బతుకమ్మ దసరా వేడుకల ముఖ్య నిర్వాహకుల్లో ఒకరైన కొర్పోల్ రజనీష్ రెడ్డిగారు మాట్లాడుతూ, ఈ వేడుకను ఇంత ఘనంగా
నిర్వహించిన పల్లె శశిధర్ రెడ్డి, శ్రీధర్ సంగ, సురేష్ రాయపల్లి, కిషోర్ దమ్ముల, హీమబిందు గుండపుడి, నందిత మాలేపాటి, కళ్యాణి పల్లె మరియు దీప విశ్వ మోహన్ లను అభినందించడం జరిగింది .

- Advertisement -