దసరా 1st డే కలెక్షన్స్.. ఇంకెంత రావాలి ?

38
- Advertisement -

నాని హీరోగా రూపొందిన దసరా చిత్రం నాని కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. కీర్తి సురేష్ హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ సముద్రఖని ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, ఇంతకీ ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ దసరా చిత్రానికి మొదటి రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం : 6.78 కోట్లు,

సీడెడ్: 2.36 కోట్లు.

ఉత్తరాంధ్ర: 1.42 కోట్లు.

తూర్పు గోదావరి: 90 లక్షలు,

పశ్చిమ గోదావరి: 55 లక్షలు,

గుంటూరు: 1.22 కోట్లు.

కృష్ణాజిల్లా: 64 లక్షలు,

నెల్లూరు: 35 లక్షలు,

ఏపీ + తెలంగాణలో దసరా చిత్రానికి మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ. 14.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 24.85 కోట్లు వచ్చాయి.

ఇతర భాషలలో – 71 లక్షలు

ఉత్తర భారతదేశంలో -55 లక్షలు

ఓవర్సీస్ లో 4.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ‘దసరా’ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ.21.10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ.38.6 కోట్లను కొల్లగొట్టింది

ఓవరాల్ గా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల బిజినెస్ జరిగింది, మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. ఇంకా 27 కోట్ల 90 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. మరి ఈ దసరా ఆ రేంజ్ వసూళ్లు రాబడుతుందా ? అనేది డౌటే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -