‘దర్శకుడు’.. తొలి ప్రేక్షకుడు

225
Darshakudu movie 1st ticket purchased by Mega Star
Darshakudu movie 1st ticket purchased by Mega Star
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి సినిమా రిలీజ్‌ అవుతుంది అంటే చాలు..మొదటి రోజు, మొదటి ఆట, మొదటి టికెట్‌ కోసం ఎలాంటి హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మెగాస్టార్‌ చిరంజీవే..ఓ సినిమాకి తొలి ప్రేక్షకుడైతే..అవును సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై సుకుమార్‌ సమర్పణలో దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా రూపొందించిన చిత్రం ‘దర్శకుడు’. ఈ చిత్రం ఆగస్ట్‌ 4న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర మొదటి టికెట్‌ని స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి కొనుక్కుని..అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..దర్శకులు సుకుమార్‌ మరియు హరిప్రసాద్‌ జక్కా లు చిరంజీవి సినిమా మొదటిరోజు మొదటి ఆట కోసం క్యూ కట్టిన వారి లిస్ట్‌లో ఉండటమే. తొలి టికెట్‌ని కొన్న చిరంజీవి ‘దర్శకుడు’ సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్ర యూనిట్‌కి బెస్ట్‌ విషెష్‌ తెలియజేశారు.

నాకు చాలా కొత్తగానూ, ఆశ్యర్యంగానూ ఉంది. ఫస్ట్‌ టికెట్‌ని నాకు అందించి, దర్శకుడు సినిమాకి నన్ను తొలి ప్రేక్షకుడిని చేసినటువంటి ఈ దర్శకుడు యూనిట్‌ సభ్యలకు, ముఖ్యంగా సుకుమార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

Darshakudu (6)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాని వెనకుండి నడిపించిన వెన్నెముక. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో గతంలో వచ్చిన కుమారి 21ఎఫ్‌ ఎంత సూపర్‌హిట్‌ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. సుకుమార్‌లో నచ్చిన విషయం ఏమిటంటే..ఒక దర్శకుడిగా ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు. తను కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటూ, ఉన్న సమయంలో మంచి కథాన్వేషణలో మంచి కథలను క్రియేట్‌ చేసుకుంటూ, అటు కమర్షియల్‌గా..డబ్బుని, పేరుని తను సంపాదించుకోవచ్చు. కేవలం నేనేమిటి అనకుండా..ఈ సినిమా ఇండస్ట్రీకి నేనేమిటి అనే కోణం నుండి ఆలోచిస్తూ..తను అప్‌కమింగ్‌ స్టోరీ రైటర్స్‌ని గానీ, అలాగే డైరెక్టర్స్‌ని గానీ, అలాగే ఆర్టిస్ట్‌లని గానీ..వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతోటి సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ని స్థాపించడం, అందులో ఔత్సాహికులైన కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. తను ఇండస్ట్రీకి గ్రేట్‌ కాంట్రిబ్యూషన్‌గా నేను ఫీలవుతున్నానని చిరంజీవి అన్నారు.

Darshakudu

అలాగే ఈ చిత్ర దర్శకుడు హరిప్రసాద్‌, సుకుమార్‌ కి కోలీగ్‌ కావడం, టీచింగ్‌ టైమ్‌ నుండి వీరిరువు స్నేహితులం కావడం అనేది యాదృచ్ఛికం. అలాంటి హరిప్రసాద్‌ గారు చెప్పిన కథని విని, పూర్తి స్వాతంత్య్రం ఇచ్చి..ఆయనకే దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. మంచి కథని అందించిన హరిప్రసాద్‌ని కూడా అభినందిస్తున్నాను. ఈ సినిమాలో నేను అబ్జర్వ్‌ చేసింది..ఒక దర్శకుడు ఏంటి అనేది అతను తెరకెక్కించిన సినిమా తెరపైన టైటిల్స్‌లో మాత్రమే మనం చూస్తాం. కానీ తెరవెనుక దర్శకుడు ఏంటి? అతనిలో ఎన్ని షేడ్స్‌ ఉంటాయి. ఎన్ని వేరియేషన్స్‌ ఉంటాయి. ఎలాంటి ఎగ్జయిట్‌మెంట్స్‌ ఉంటాయి. ఈ రకమైన కోణాల నుండి కొత్తగా ఈ సినిమాని ఆవిష్కరించారు. దర్శకుడు అంటే లవ్‌ స్టోరీతో సినిమాలు చేయడమే కాదు..అతని జీవితంలో కూడా ఎలాంటి లవ్‌స్టోరీ ఉంటుంది అనేది ఈ చిత్రంలో చాలా చక్కగా ఆవిష్కరించబడిన చిత్రం ఇది. నాకు తెలిసి..ఇందులో సుకుమార్‌ లైఫ్‌కి సంబంధించిన విషయమేదో కనెక్ట్‌ అయి ఉంటుంది. అందుకే ఈ సినిమాని తెరకెక్కించాలని భావించి ఉంటాడని అనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోగా నటించిన యంగ్‌స్టర్‌ అశోక్‌..మంచి హీరో మెటిరీయల్‌. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్లుగా నటించిన ఈషా, పూజితలకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కెమెరా ఇచ్చిన ప్రవీణ్‌, ఇంకా సాంకేతిక నిపుణులందరికీ బెస్ట్‌ విషెష్‌ తెలియజేస్తున్నాను. ఈ సినిమా కుమారి 21ఎఫ్‌ కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.

- Advertisement -