డార్క్ చాక్లెట్ తింటే ఎన్ని లాభాలో..!

79
- Advertisement -

చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలలో చాక్లెట్ మొదటి స్థానంలో ఉంటుందనే చెప్పవచ్చు. సమయం సందర్భం లేకుండా చాక్లెట్ తింటూ ఉంటారు. అయితే కేవలం చిన్న పిల్లలు మాత్రమే కాకుండా కొందరు పెద్దలకు కూడా చాక్లెట్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ను ఎంతో ఇష్టంగా తింటూఉంటారు. అయితే చాక్లెట్ అతిగా తినడం వల్ల దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి. త్వరగా దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే డార్క్ చాక్లెట్ తినడం వల్ల లాభాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. చాక్లెట్ లో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, భాస్వరం, ఐరన్, జింక్, సెలీనియం వంటివి అధికంగా ఉంటాయి.

ఇవన్నీ కూడా శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో సహాయ పడతాయి. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. వీటిని తిన్నప్పుడు ఎండోర్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. అందువల్ల ఒత్తిడి దురమౌతుంది. ఇంకా ఇందులో ఉండే పొటాషియం, మాంగనీస్ వంటివి గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఐరన్ రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గించడంలో డార్క్ చాక్లెట్ ఎంతో ఉపయోగపడతాయి. ఇక ఇందులో ఉండే జింక్ పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలను దూరం చేసి సామర్థ్యాన్ని పెంచడంలో దోహదపడతాయి. అందుకే కనీసం రోజుకు ఒక డార్క్ చాక్లెట్ తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టుకు కవిత..!

- Advertisement -