దర్బార్..ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్‌

455
darbar pre release
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజినీ ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా జనవరి 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 3న హైదరాబాద్‌ శిల్ప కళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కి రజనీకాంత్ హాజరుకానున్నారు.

అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -