చిరు 152 మూవీ అప్‌డేట్‌..!

621
chiru
- Advertisement -

సైరా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు మెగాస్టార్ చిరంజీవి కమిట్ అయిన సంగతి తెలిసిందే. సైరా సెట్స్‌పై ఉండగానే కొరటాలతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఈ నేపథ్యంలో చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న కొరటాల ఇందుకు సంబంధించిన కథను సిద్ధం చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేటలో చిరు మూవీకి సంబంధించిన భారీ సెట్ సిద్ధంగా కాగా సంక్రాంతి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీలో చిరు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనుండగా మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించనుంది.

కొణిదల ప్రొడక్షన్స్‌, మాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తుండగా 2020 దసరాకి సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న కొరటాల ….మెగాస్టార్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

- Advertisement -