సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం పై తెలుగు, కన్నడ నాట ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను నేరుగా సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.
*ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ*.
తెలుగు, కన్నడ నాట ‘దండుపాళ్యం – 4 ‘ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయటం జరిగింది. ట్రైలర్ విడుదల అయిన కొద్ది సమయానికే చిత్రం పై అనూహ్యమైన స్పందన పెరిగింది. సోషల్ మీడియాలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడం, ట్రెండింగ్ అవటం, చిత్ర విజయం పై మా నమ్మకాన్ని మరింత పెంచింది. సినిమా బాగా వచ్చింది అన్నది చిన్నమాట. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. నవంబర్ 1 న ‘దండుపాళ్యం – 4 ‘ చిత్రాన్ని తెలుగు, కన్నడ నాట అత్యధిక ధియేటర్ లలో విడుదల చెయ్యబోతున్నాము.
*దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ*.
దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నవంబర్ 1 న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. సుమన్ రంగనాథన్, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్‌కుమార్, పాత్రలు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.