స్థానిక ఎమ్మెల్సీకి నామినేష‌న్ దాఖ‌లు చేసిన దండే విఠ‌ల్..

167
- Advertisement -

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి దండే విఠ‌ల్ మంగ‌ళ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌తో క‌లిసి ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్ కు నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. అంత‌కుముందు ఎమ్యెల్యే క్యాంప్ కార్యాల‌యంలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జ‌డ్పీ చైర్మ‌న్లు, ముఖ్య నాయ‌కులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి దండే విఠ‌ల్ కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. అక్క‌డి నుంచి క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి చేరుకున్నారు. దండే విఠ‌ల్ కు మ‌ద్ధ‌తుగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామ‌న్న మొద‌టి సెట్ నామినేష‌న్ దాఖ‌లు ప్ర‌క్రియ‌లో పాల్గొన్నారు. మొత్తం నాలుగు సెట్ల నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేస్తున్నారు.

- Advertisement -