డ్యాన్సర్‌ని కాల్చేశాడు….

225
Dancer Girl Died While Fire in A Marriage Function at Bathinda
- Advertisement -

పంజాబ్‌ లో దారుణం చోటు చేసుకుంది. స్టేజ్ పై డాన్స్‌ చేస్తున్న ఇరవై రెండేళ్ల ఏళ్ల డ్యాన్సర్ని ఒక వ్యక్తి అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. తనతో కలిసి డ్యాన్స్ చేసేందుకు నిరాకరించినందుకు ఆమెను దారుణంగా కాల్చిచంపాడో దుండగుడు. పంజాబ్‌లోని భటిండాలో ఈ దారుణం జరిగింది. ఓ వివాహ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టేజ్ డ్యాన్స్‌ షోలో మహిళా డ్యాన్సర్లు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనతో డ్యాన్స్ చేయాల్సిందిగా ఓ డ్యాన్సర్‌ను కోరాడు.

Dancer Girl Died While Fire in A Marriage Function at Bathinda

కానీ అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు వందలాదిమంది చూస్తుండగానే అతి సమీపం నుంచి తపంచాతో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో డ్యాన్స్ చేస్తున్న ఆమె ఒక్కసారిగా స్టేజిపై కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో తెలియని మిగతా డ్యాన్సర్లు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన పెళ్లి కార్యక్రమం ఈ ఘటనతో భయానకంగా మారిపోయింది.

Dancer Girl Died While Fire in A Marriage Function at Bathinda

నిందితున్ని పట్టుకున్న మిగతా వీక్షకులు, ఆమె దగ్గరకు వెళ్లి చూసే లోపే నిర్జీవంగా పడి ఉంది. మిగతా డ్యాన్సర్లంతా భయంతో పరుగులు తీశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సదరు వ్యక్తిగా ఫుల్‌ గా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. తనతో డ్యాన్స్‌ చేయలేదన్న కారణంతోనే ఆమెను కాల్చి చంపినట్లు నిందితుడు చెబుతున్నాడు.

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఆమెకు బంధువు కూడా అవుతాడని తెలుస్తోంది. మృతి చెందిన డ్యాన్సర్ గర్భవతి అని, ఈ సంఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని భాటిండా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

https://youtu.be/s0tPQZkimRs?t=67

- Advertisement -