- Advertisement -
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ దానం మెడలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దానం నాగేందర్ ఏ కారణం చేత టీఆర్ ఎస్ పార్టీలో చేరారో ఆయన నిన్న వివరంగా మీడియాకు తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఓ చరిత్ర అని..ఇప్పడు రాష్ట్ర పున నిర్మాణం మరో అద్భుతం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతోన్న పథకాలు అద్భుతమన్నారు సీఎం కేసీఆర్. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పథకాలు దేశంలోనే నెం1గా నిలిచాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమాజంలోని బాధ, ఆవేదనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నామని, తెలంగాణలో 85శాతం వరకూ బలహీన వర్గాలు ఉన్నాయని..కళ్యాణ లక్ష్మీ పథకాన్ని అగ్రకులాల్లో ఉన్న పేదవారికి కూడా ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు 24గంటల కరెంట్ ఇస్తూ చరిత్ర సృష్టించామన్నారు. కాంగ్రెస్ నాయకులవి చిత్తశుద్ది లేని మాటలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో తెలంగాణ రాష్ట్రం నెం1 స్ధానంలో ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో 99కార్పొరేటర్ సీట్లు గెలిచిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదన్నారు. తెలంగాణ లో ప్రధానమైన అంశం సాగునీరు…2020జూన్ వరకూ ఆకుపచ్చ తెలంగాణ అవతరిస్తోందన్నారు. తెలంగాణ పచ్చని పంటలతో కళకళలాడుతుందన్నారు. భారతదేశంలో ధనికులైన యాదవులు, రైతులు, మత్య్సకారులు ఎక్కడున్నారంటే తెలంగాణలో అని చెప్పుకునే రోజు వచ్చిందన్నారు. ప్రభుత్వం చేస్తోన్న పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు. హోంగార్డులకు దేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు. దానం నాగేందర్ కు పార్టీలో క్రియాశీలక పదవి లభిస్తోందన్నారు. రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని, 100 పైగా సీట్లను గెలుచుకుని టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని పలు సర్వేలు స్సష్టం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
- Advertisement -