బర్త్ డే గిఫ్ట్.. 60కేజీల మెస్సీ చాకోలెట్ శిల్పం…

216
messi chocolate
- Advertisement -

అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ నేడు 31వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నాడు మెస్సీ. ప్రస్తుతం రష్యా వేదికగా ఫిఫా ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు అతని జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. మేడమ్ టుస్సాడ్ లోనూ మెస్సీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

The Messi chocolate -FIFA special ss

ఇక మాస్యోలోని ఓ బేకరి నిర్వాహకులు మాత్రం మెస్సీపై ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు. 7 రోజులు కష్ట పడి 60 కిలోల బరువుండే మెస్సీ చాకోలేట్ విగ్రహాన్ని తయారు చేశారు. ఐదుగురు సభ్యులు కలిసి మెస్సీ అందమైన చాకోలేట్ శిల్పానికి రూపం పోశారు.

The Messi chocolate -FIFA special

మరోవైపు ఫిఫా ప్రపంచకప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన మెస్సీ టీం.. ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి డ్రాగా ముగించగా.. మరొక మ్యాచ్ లో 0-3 పాయింట్లతో ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఇక ప్రపంచకప్ లో నిలవాలి అంటే ఈ నెల 26న అర్జెంటీనాతో జరిగే చివరి మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అర్జెంటీనా ఆఖరి స్థానంలో ఉంది.

- Advertisement -