బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారగా నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడులను అప్రమత్తం చేసింది ఐఎండీ. ఇక దానా తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై దానా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని అన్నారు.దానా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తీర ప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించగా దాదాపు 400 ట్రైన్లను రద్దు చేశారు.
Also Read:KTR:తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష