రాజ్యసభ సభ్యులుగా దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక..

115
- Advertisement -

రాజ్యసభ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దివకొండ దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. దీంతో రెండు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారధి రెడ్డి మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ్య ద్వైవార్షిక ఎన్నిక ఏకగ్రీవమైంది.ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. వీరికి ఎన్నిక ధ్రువపత్రాల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ తన అభ్యర్థులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డిని ప్రకటించింది. వారితోపాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -