గుడ్డు సకల పోషకాల సమ్మేళనం అనే సంగతి అందరికీ తెలిసిందే. గుడ్డులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక్క గుడ్డైన తినాలని ఆహార నిపుణులు చెబుతుంటారు. అయితే గుడ్డును ఎప్పుడు తినాలి అనే దానిపై చాలమందికి స్పష్టత ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అయితే గుడ్డు ఎప్పుడు తిన్న అందులోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. కాని సరైన టైమ్ లో తింటే అందులోని పోషకాలను శరీరం ఎక్కువగా వినియోగించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే పడగడుపున తినడం మంచిదట..
ఉదయన్నే వ్యాయామం చేసిన తరువాత ఉడకబెట్టిన గుడ్డు ఒకటి లేదా రెండు తినడం వల్ల అందులోని పోషకాలను శరీర భాగాలు త్వరగా శోషించుకుంటాయట. గుడ్డులో ఉండే విటమిన్ ఏ, బి5, బి12, డి, కె, ఇ.. ఇలా అన్నీ పోషకాలు సమృద్దిగా అందుతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచి కండరాల పుష్టికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇంకా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా సహాయ పడుతుంది. రోజు గుడ్డి తిని ప్రారంభంచడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండానికి దోహదపడుతుంది. గుడ్డులో ఉండే డి విటమిన్ హార్మోన్ల అసమతుల్యతను దూరం చేస్తుంది. రోజంతా మెదడును యాక్టివ్ గా ఉంచుతుంది. ఇంకా రోగనిరోదక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం పూట గుడ్డును తినడం ఎంతో మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Also Read:ఆ సినీ రచయిత మాట నేటికీ గొప్పదే