పిచ్చోడి చేతిలో రాయిలా..అరవింద్ చేష్టలు:విఠల్

733
dadannagari vittal rao
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై తీవ్రంగా మండిపడ్డారు జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు. సీఎం కేసీఆర్, కేటీఆర్,కవితలపై విమర్శలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన విఠల్…అరవింద్ చేష్టలు చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉందన్నారు.

ఆయన చేష్టలు..మాటలకు అసలు పొంతనే లేదన్నారు. కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. ఆయన్ను దేశద్రోహి అని విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్, కేటీఆర్ ను విమర్శిస్తే ఉరుకోమని హెచ్చరించారు.

కాళేశ్వరంతో కోటి ఎకరాల మాగానికి నిరందించటం దేశ ద్రోహమా అంటూ అరవింద్‌ను ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీగా కవిత చేసిన అభివృద్ధి బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు,బీజేపీ జాతీయ నాయకులు సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను మెచ్చుకున్నారని…పసుపు బోర్డు తీసుకొస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నావని మండిపడ్డారు.రైతులకు యూరియా దొరకటం లేదు. దమ్ముంటే కేంద్రానికి చెప్పి యూరియా తెప్పించాలని సవాల్ విసిరారు.

- Advertisement -