త్వరలో పాలమూరుకు సీఎం కేసీఆర్‌:నిరంజన్‌రెడ్డి

681
niranjanreddy
- Advertisement -

కాళేశ్వరం పూర్తితో కేసీఆర్ పై ప్రజలలో మరింత విశ్వాసం పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను పరిశీలించారు నిరంజన్ రెడ్డి. త్వరలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు సీఎం రానున్నారని చెప్పారు.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా శరవేగంగా పాలమూరు పనులు పూర్తిచేస్తామననారు. ఏదుల, వట్టెం పంప్ హౌస్ పనులు సాఫీగా సాగుతున్నాయని చెప్పారు. అడవిలో ఉండడంతో కొంత ఆలస్యంగా నార్లాపూర్ పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయన్నారు. 55 శాతం వట్టెం, 45 శాతం కర్వెన, 98 శాతం ఏదుల , 60 శాతం నార్లాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తైనట్లు చెప్పారు.

రోజుకు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోయాలన్నది పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉద్దేశం…ముందుగా ఒక టీఎంసీ నీళ్లు ఎత్తిపోసే పనులు పూర్తి చేసి వరదకాలంలో రోజుకు 1 టీఎంసీ ఎత్తిపోసుకుని 100 రోజుల్లో 100 టీఎంసీలు ఎత్తిపోసుకుని పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమన్నారు.

ఉమ్మడి పాలమూరులో 20 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని కేసీఆర్ మాట ఇచ్చారని… పెండింగు ప్రాజెక్టుల పూర్తితో ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

- Advertisement -