నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు..

272
dasyam-vinay-bhasker
- Advertisement -

వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరోనా లోక్ డౌన్ కారణంగా ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా జరుపుకుంటున్నాం అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.

ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోన మహమ్మారిని నియంత్రించడంలో మున్సిపల్ కార్మికుల కృషి మరువలేనిదన్నారు. వైరస్ కట్టడిలో జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో పనిచేశారని….సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ఉద్యమ స్పూర్తితో జిల్లాను అభివృద్ధి చేస్తామని ….సీఎం కేసీఆర్ తెల్లరేషన్ కార్డు లబ్ది దారులకు 12 కిలోల బియ్యంతో పాటు 1500 నగదును అందించారని తెలిపారు. వలస కూలీలకు అదుకొని దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 365 రోజులు సాగు నీరు అందిస్తున్నామని…సీఎం కేసీఆర్ సూచించిన విధంగా నియంత్రత పంటలను సాగు చేయాలన్నారు.

- Advertisement -