డీఎస్‌కు తీవ్ర అస్వస్థత..

32
- Advertisement -

మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఫిట్స్ రావడంతో హుటాహుటిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డీఎస్. రాజశేఖర్ రెడ్డి – డీఎస్‌ కాంబోలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -