ఐపీఎల్ 15…బీసీసీఐ భారీ ఏర్పాట్లు

175
bcci
- Advertisement -

క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టోర్నీ ఐపీఎల్. ఇప్పటివరకు 14 సీజన్‌లు పూర్తి చేసుకోగా కరోనా కారణంగా మిగిలిన తాజా సీజన్‌లోని మ్యాచ్‌లను దుబాయ్‌ వేదికగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీసీసీఐ.

కొత్తగా రెండు జట్లకు బిడ్లను ఆహ్వానించగా బిడ్‌ దాఖలు పూర్తయితే అదనపు జట్లతో కలిసి 10 టీమ్‌లతో ఐపీఎల్ 2022 జరగబోతుంది. రెండు కొత్త జట్ల ద్వారా అదనంగా 5 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది బీసీసీఐ.

కొత్తగా చేరే ఒక్కో జట్టు బేస్ ప్రైజ్ కింద బీసీసీఐకి 2 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బిడ్ వేసేందుకు ఒక్కో కంపెనీ 75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అహ్మదాబాద్‌తో ఓ కొత్త జట్టు రావడం ఇప్పటికే అనధికారికంగా కన్ఫార్మ్ అయినా… లక్నో, పూణె, కొచ్చి పేర్లతో కొత్త జట్లు వస్తాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌ మరింత ఆసక్తికరంగా సాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -