- Advertisement -
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ ఉండటంతో, తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ అల్పపీడనం నేడు (నవంబర్ 24) వాయుగుండంగా (Depression) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
అంతేకాకుండా, రానున్న 48 గంటల్లో ఈ వాయుగుండం మరింత తీవ్రమై, పూర్తిస్థాయి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఒకవేళ ఈ వాతావరణ వ్యవస్థ తుపానుగా మారితే, దానికి ‘సెన్యార్’ (Senyar) అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం.
ఈ పేరును ఒమన్ దేశం సూచించినట్టు తెలుస్తోంది.ఈ తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులకు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని (IMD) తెలిపింది. తుపాను తీరానికి చేరే సమయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read:రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
- Advertisement -

