- Advertisement -
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పెను తుపానుగా మారి మహారాష్ట్రలోని అలీబాగ్‌కు 45 కిమీల దూరంలో తీరాన్ని తాకింది. నిసర్గ తాకిడితో సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. దాదాపు వందేళ్ల తర్వాత ముంబైని తుపాను తాకగా నిసర్గ తీరం దాటడానికి సుమారు మూడు గంటలు పట్టనుంది.
తుపాను ప్రభావంతో ముంబై , దక్షిణగుజరాత్, రాయ్ ఘడ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లోని 90 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
దాదాపు గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రజలు ఎవరు భయటికి రావొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. తుఫాన్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Advertisement -