Cyclone Dana: పెను తుపానుగా మారి దానా

4
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడింది దానా. వాయవ్య బంగాళాఖాతంలోకి ఏర్పడగా ఒడిశా, బెంగాల్‌ తీరాలకు అలర్ట్ జారీ చేశారు.15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోంది దానా. పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో.. సాగర్‌ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.

రాత్రి పూరి-సాగర్‌ ఐలాండ్ దగ్గర తీరందాటనుంది దానా తుపాన్. తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనుండగా ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌ తీరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దానా తుపాను కారణంగా 200 రైళ్లు రద్దయ్యాయి. విమానాలను సైతం నిలిపివేశారు అధికారులు. ‘దానా’ తుఫాను కారణంగా కోల్‌కతా సహా దక్షిణ పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఒడిశా, బెంగాల్‌లోని అనేక తీరప్రాంత జిల్లాల నుండి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే 1.14 లక్షల మందికి పైగా ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read:Bigg Boss 8 Telugu: హరితేజను సేవ్ చేసిన గౌతమ్

- Advertisement -