బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు..

4
- Advertisement -

బంగాళాఖాతంలో మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. రానున్న ఆరు గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాతి 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 2 సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరే అవకాశం ఉందని తాజా వాతావరణ అంచనాల్లో వెల్లడించింది.

దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇవాళ ఉదయం 8.30 గంటల సమయానికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారింది.

ప్రస్తుతం బలపడుతున్న వాతావరణ వ్యవస్థ మరో 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మధ్య పశ్చిమ బంగాళాఖాతం వైపు కదులుతుందని అంచనా వేస్తోంది. నవంబర్ 2 సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read:జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ వ్యవస్థ కదలికలపై ఒడిశా వాతావరణ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. తుఫాన్ ప్రభావం ఏ ప్రాంతాలపై ఎంతమేర ఉండనుందనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తుఫాన్ తీవ్రత, దిశ, తీరానికి చేరుకునే సమయంపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అంచనాలు వెల్లడించనుంది.

ప్రస్తుతం ఈ వ్యవస్థ వాయుగుండంగా మారిన తర్వాత తుఫాన్‌గా బలపడే అవకాశాలున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.

- Advertisement -