- Advertisement -
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు డీసీపీ విజయ్ కుమార్ . రోడ్డు ప్రమాదాలు దృష్ట్యా కొత్త నిబంధనలు తీసుకొచ్చామని వెల్లడించారు.
బైక్ కు రెండు మిర్రర్స్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఈ వాహనంపై ఇద్దరు మాత్రమే ఉండాలని..వీరిద్దరికీ హెల్మెట్ కంపల్సరీ అన్నారు. హెల్మెట్లు లేకపోతే చలాన్లు వేస్తామన్నారు.
ఆటోలో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. క్యాబ్ లో డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉండాలన్నారు. ఒకవేళ రూల్స్ పదే పదే ఉల్లంఘిస్తే…మాత్రం మోటార్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -