- Advertisement -
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని సూచించారు. హైదరాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
అవసరమైతే ఎవరూ బయటికి రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఇప్పటికే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ములుగు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి వాగులు, వకంలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకటాపురం, వాజేడు మండలాల్లో కుండపోత వాన కురుస్తుండగా వెంకటాపురం-భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచాయి. రాళ్లవాగు వద్ద మట్టిరోడ్డు తెగిపోయింది.

Also Read:సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యం!
- Advertisement -

