నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై CWCలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ చట్టం కార్మికులు, పేదలు, వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా ఏ విధమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టాలన్నదానిపై స్పష్టమైన వ్యూహం రూపొందించనున్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా, కొత్త ఉపాధిహామీ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్, ప్రజలను ఎలా సమీకరించాలి, పార్టీ శ్రేణులు ఏ విధంగా ఉద్యమాల్లో పాల్గొనాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేయనుంది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ ఉద్యమ రాజకీయాలకు మరింత ఊపు రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:డెస్క్ జర్నలిస్టుల మీద ఎందుకు వివక్ష?

