చైతు.. ఓటీటీలో కూడా డిజాస్టరేనా ? 

32
- Advertisement -
థియేటర్లలానే ఇప్పుడు ఓటీటీ కూడా ప్రేక్షకుల జీవితంలో భాగమైంది. దీంతో ఓటీటీ సంస్థలు..  ప్రతివారం కొత్త సినిమాలు అందిస్తున్నాయి. అయితే కొన్ని ప్లాప్ సినిమాలకి ఇప్పుడు ఓటీటీనే దిక్కు అన్నట్టు తయారు అయ్యింది పరిస్థితి. నాగచైతన్య సినిమా కూడా ఓటీటీ రిజల్ట్ పైనే ఆధారపడింది. చైతు హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కస్టడీ. ఈ మూవీ మే 12న రిలీజ్ అయి ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో రానుంది.
జూన్ 9 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. పైగా ఈ సినిమా తెలుగు, తమిళ్ లో స్ట్రీమ్ కానుంది. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. ఈ సినిమాకి భారీ మొత్తం ఇచ్చి అమెజాన్ ప్రైమ్ కొనలేదు. వ్యూస్ ను బట్టి డబ్బు అన్నట్టు ఒప్పందం చేసుకున్నారు. సో.. ఇప్పుడు ఈ కస్టడీ సినిమా సేఫ్ అవాలి అంటే.. కచ్చితంగా భారీ వ్యూస్ రావాలి. కానీ వస్తాయా? ఇదే ఇప్పుడు పెద్ద డౌట్.
డిజాస్టర్ అయిన కస్టడీ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎందుకు ఆసక్తి చూపిస్తారు.  సూపర్ హిట్ అయిన మూవీ అయితే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓటీటీల్లో ఓ సినిమా సక్సెల్ పుల్ గా దూసుకుపోవాలి అంటే.. ఆ సినిమా పై భారీ బజ్ ఉండాలి. లేదా, ఆ సినిమాలో స్టార్ హీరో అయ్యి ఉండాలి. చైతు కి ఆ స్టార్ డమ్ రాలేదు. కాబట్టి…కస్టడీ సినిమా ఓటీటీలో కూడా డిజాస్టర్ లా నిలిచేలా ఉంది.
- Advertisement -