పిల్లలకు సీజనల్ రోగాల గురించే కాకుండా సీజనల్ ఫలాల గురించి కూడా వివరించండి. ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు సీజనల్ ఫలాలు తింటున్నారు. దానికి కారణం ఒకింత కరోనా అని చెప్పుకోవచ్చు.
ప్రకృతిలో దొరికే వివిధ కాలాల్లో దొరికే ఫలాలను తినక మన పిల్లలకు తినపించక నానా ఆవస్థలు పడి డాక్టర్ల వద్దకు పరుగెత్తి ఇంగ్లీష్ మందులు తెచ్చి పిల్లల నోట్లో పోసి చేతులు దులుపుకుంటాము. అలా కాకుండా సీజనల్ ఫలాలు తినిపించడం వల్ల పిల్లలో రోగ నిరోధక శక్తి పెరిగి బలాన్ని ఇచ్చి పుష్టిగా తయారయ్యేలా చేస్తుంది. అలాంటిది చలికాలంలో దొరికే ఫలం ఎంటో చూసేద్దామా..రండి.
సీతాఫలం ఇది తెలంగాణలో చిప్పలకాయ అంటారు. వీటిని పేదవాన్ని ఆపిల్ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు సమృద్దిగా లభిస్తాయి. ఈ ఒక్క పండు తిన్న వేంటనే శక్తినిస్తుంది. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలుచేస్తుంది.
సీతాఫలంతో కలిగే మరిన్ని లాభాలు
- సీజన్లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది
- జీర్ణశక్తి పెంపొందుతుంది.
- ఎముకలు దృఢంగా మారతాయి
- సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది.
- రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది.
- రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది.
- రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
- ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలని దూరం చేస్తాయి.
- యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి.
- ఇన్ఫెక్షన్లు దరి చేరవు. గాయాలు కూడా త్వరగా మానుతాయి
- శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. చలువ చేస్తాయి.
- కండరాలను దృఢంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది.
- సీతాఫలంలో ఉండే కాపర్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
- ఒక సీతాఫలంలోనే వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్ లభిస్తుంది.
- కొవ్వూ, కెలొరీలు తక్కువగా ఉండి బరువు తగ్గాలనుకునేవారికి మేలు చేస్తుంది.
- ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది.
- విటమిన్ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది.
- కండరాలు, నరాల బలహీనతను అధిగమించడానికి సీతాఫలం తోడ్పడుతుంది
ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే వెళ్లి మీదగ్గరలోని మార్కెట్లకు వెళ్లి చిప్పలకాయ(సీతాఫలం) తెచ్చుకొండి. హాయిగా తినండి…మరేందుకు ఆలస్యం.
ఇవి కూడా చదవండి..