రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం

5
- Advertisement -

రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడి సీటు వద్ద కరెన్సీ నోట్లు దొరకడం తీవ్ర దుమారం రేపింది. రాజ్యసభలో సెక్యూరిటీ సిబ్బంది 500 నోట్లతో కూడిన రూ.50వేల నగదు కట్టను గుర్తించారు. ఈ అంశాన్ని రాజ్యసభ భవన్ అధికారులు చైర్మన్ జగదీప్ ధన్ఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఆదేశించినట్లు రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.

గురువారం సభ వాయిదా పడిన తరువాత సీటు నెంబర్ 222 వద్ద నగదు దొరికినట్లు భద్రతా అధికారులు నాకు తెలియజేశారని, ఆ సీటును తెలంగాణ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారని తెలిపారు. ఈ అంశంపై అభిషేక్ మను సింఘ్వీ ఎక్స్ వేదికగా స్పందించారు.

తాను మొదటిసారి విన్నా.. ఇలాంటిది. ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. నేను ఎప్పుడూ రాజ్యసభకు వెళ్లినా జేబులో రూ.500 నోటు ఒక్కటే పెట్టుకుంటాను. నేను రాజ్యసభకు గురువారం మధ్యాహ్నం 12.27 గంటలకు చేరున్నాను. మధ్యాహ్నం 1గంటకు సభ వాయిదా పడింది. నేను అప్పటి నుంచి 1.30 గంటల వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కేంటిన్ లో కూర్చున్నాను.. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయా అంటూ సింఘ్వీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also  Read:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..

- Advertisement -