ప్రతిరోజూ ఉదయం లేవగానే చాలమందికి కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది. ఇవి తాగడం వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు దురమౌతాయని చెబుతుంటారు. అయితే కొందరిలో మాత్రం కాఫీ టీ వంటివి తగిన మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం పడగడుపున జీలకర్ర నీటిని తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్టలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వికారం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగితే ఎంతో మంచిదట. .
ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే వెంటనే తాగేయ్యాలి. ఇలా పడగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణశాయంలో రకరకాల ఎంజైమ్ లు ఉత్పత్తి అయి. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా అజీర్తి సమస్యలు దరిచేరవు. గర్బిణీలు ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగాలట. ఎందుకంటే గర్భదారణ సమయంలో వచ్చే సమస్యలను జీలకర్ర రసం తగ్గిస్తుంది.
Also Read:బయో గడియారం అంటే ఏంటో తెలుసా?
ఇక జీలకర్రలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది కాబట్టి పాలిచ్చే తల్లులు కూడా ప్రతిరోజూ జీలకర్ర రసం తాగాలని నిపుణుల సూచన. జీలకర్రలో ఐరన్ తో పాటు ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటాయి. డయాబెటిస్ తో బాధపడే వారు, మరియు శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు కూడా తప్పనిసరిగా ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగితే మంచిదట. అలాగే జీలకర్రలో ఉండే పొటాషియం కారణంగా హైబిపి కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆయా సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నా మాట.
Also Read:బిహార్‌లో విపక్షాల భేటీ..