IPL 2023:ఐదోసారి విజేతగా చెన్నై

44
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా ఐదోసారి విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది విజయాన్ని నమోదుచేసింది. వ‌ర్షం కారణంగా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో15 ఓవ‌ర్ల‌కు చెన్నై ల‌క్ష్యాన్ని 171 ప‌రుగులుగా నిర్దేశించారు. చెన్నై బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే(47; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్‌(26; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అజింక్యా ర‌హానే(27; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబే(32 నాటౌట్; 21 బంతుల్లో 2సిక్స‌ర్లు), అంబ‌టి రాయుడు (19; 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు. ఆఖ‌ర్లో చెన్నై విజ‌యానికి రెండు బంతుల్లో 10 ప‌రుగులు అవ‌స‌రం కాగా జ‌డేజా (15నాటౌట్; 6 బంతుల్లో 1 సిక్స్‌, 1 ఫోర్‌) వ‌రుస‌గా సిక్స్, ఫోర్ కొట్టి గెలిపించాడు.

Also Read:MAY29:ఎవరెస్ట్ డే

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ (96; 47 బంతుల్లో 8ఫోర్లు, 6సిక్స‌ర్లు) దంచికొట్టగా వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌) హాప్ సెంచ‌రీతో రాణించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (39; 20 బంతుల్లో 7ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా(21 నాటౌట్‌; 12 బంతుల్లో 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడటంతో భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది గుజరాత్.

Also Read:Rajamouli:మేమ్‌ ఫేమస్‌ చిత్ర యూనిట్‌ని అభినందనలు

- Advertisement -