మా హృదయం ముక్కలైంది.. మీరంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాం అని ఆప్గానిస్తాన్ భూకంపంపై స్పందించింది సీఎస్‌కే. ఈ భూకంపం వార్త విని తమ హృదయం ముక్కలైందని.. ఈ కష్ట సమయంలో తామ అఫ్గనిస్థాన్ ప్రజల గురించి ప్రార్ధిస్తామని చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్ ద్వారా తెలిపింది.
ఈ కష్టకాలంలో మానసిక నిబ్బరం, ఆశతో మీరంతా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ప్రకృతి విలయానికి అల్లాడిపోయిన అఫ్గన్ ప్రజల గురించి దేవుడిని ప్రార్ధిస్తాం అని తెలిపింది సీఎస్‌కే యాజమాన్యం.
ఐపీఎల్‌లో పలువురు అఫ్గన్ క్రికెటర్లు సీఎస్కే తరఫున ఆడారు. ప్రస్తుతం చెన్నై స్క్వాడ్‌లో యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఉన్నాడు. ముక్కోణపు సిరీస్ సందర్భంగా అఫ్గనిస్తాన్, యూఏఈ క్రికెటర్లు భూకంప బాధితుల కోసం మైదానంలో మౌనం పాటించారు. అంతేకాదు తమ మ్యాచ్ ఫీజుతో పాటు విరాళంగా వచ్చిన సొమ్మును కునార్ రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు అందిస్తామని అఫ్గన్ ఆటగాళ్లు తెలిపారు.
To our brothers and sisters in Afghanistan, we’re heartbroken by the earthquake that struck your land.
In this darkest hour, may strength and hope lift you again. pic.twitter.com/enaZTqDkj8
— Chennai Super Kings (@ChennaiIPL) September 1, 2025
Also Read:యూరియా ఇవ్వలేని సర్కార్..రైతుల ఆగ్రహం

