ప్లే ఆఫ్స్‌లో చెన్నై…

111
csk
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్‌. టోర్నిలో తొమ్మిదో విజయంతో అందరికంటే ముందుగా ప్లే ఆఫ్‌కి చేరగా తొమ్మిదో ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుండి తప్పుకుంది హైదరాబాద్. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. హైదరాబాద్‌ విధించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 139 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (38 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్‌ (36 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (2), కెప్టెన్‌ విలియమ్సన్‌ (11), ప్రియమ్‌ గార్గ్‌ (7) విఫలమయ్యారు.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోష్‌ హాజల్‌వు డ్‌ (3/24), బ్రావో (2/17) హైదరాబాద్‌ను కట్టడి చేశారు.

- Advertisement -