ఐపీఎల్ 16 సీజన్ ముగింపు దశకు వచ్చింది. ప్లే ఆఫ్ లోకి చేరిన చెన్నై, గుజరాత్, ముంబై, లక్నో జట్ల మద్య రసవత్తరమైన పోటీ నడుస్తోంది. ఇక మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్ లో చెన్నై అద్బుత విజయాన్ని సొంతం చేసుకొని ఫైనల్ లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ 157 పరుగులకే ఆలౌట్ గా నిలిచింది. దీంతో 15 పరుగుల తేడాతో గుజరాత్ పై విజయం సాధించిన చెన్నై ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పటివరకు 10 సార్లు ఫైనల్ చేరిన జట్టుగా చెన్నై రికార్డ్ సృష్టించింది. .
అయితే అందులో 5 సార్లు రన్నరప్ గా నిలవగా, 4 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. మరి ఈసారి కప్ గెలుస్తుందా లేదా రన్నరప్ గా నిలుస్తుందా చూడాలి. ఇక నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జల్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 లోకి అడుగుపెట్టి గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో చెన్నైసూపర్ కింగ్స్ తో ఢీ కొడుతుంది. ఇక ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ రెండు జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయి.
Also Read:తారక్ ను భయపెడుతున్న ఫ్యాన్స్ !
గత ఏడాది కూడా ప్లే ఆఫ్ కు చేరిన లక్నో ఆర్సీబి చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించగా ఈ ఏడాది మాత్రం ఎలాగైనా కప్పు సాధించాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం జట్టు కూడా అని విభాగాల్లోనూ పటిష్టంగా ఉండడంతో లక్నో విజయం గట్టిగానే కన్నెసింది. ఇక టోర్నీ ప్రారంభంలో వరుస ఓటములతో నిరాశపరిచిన ముంబై ఆ తరువాత పుంజుకొని వరుస విజయాలతో ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ముంబై ప్రధాన బలం. ఇక ఇప్పటివరకు 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఆరో సారి కూడా కప్పు గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. అందువల్ల లక్నో తో నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించడం కీలకం. దీంతో ఆసక్తికరంగా మారిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.