ముంబైని చిత్తుచేసిన చెన్నై..

153
mi
- Advertisement -

ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ముంబైని చిత్తుచేసింది ధోని సేన. ముంబై విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఓటమి పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్లు కొల్పోయి 136 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ధోని సేన ముంబైపై 20 పరుగుల తేడాతో గెలుపొందింది.

స్వల్ప లక్ష్యచేధనతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు డికాక్‌ (17; 3 ఫోర్లు), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (16; 2 ఫోర్లు, 1 సిక్స్‌)లను దీపక్‌ చహర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే సూర్యకుమార్‌ యాదవ్‌ (3), ఇషాన్‌ కిషన్‌ (11)లు కూడా అవుటయ్యారు. ఒక ఎండ్‌లో సౌరభ్‌ తివారీ ఆడుతున్నా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరువయ్యాడు. గెలిపిస్తాడనుకున్న పొలార్డ్‌ (15) కీలక సమయంలో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ముంబై ఓటమి ఖాయమైంది.

ఇక అంతకముందు బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి కూడా ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఒక్కొక్కరుగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపట్టడంతో ముంబై కనీసం 130 పరుగులైనా దాటుతుందా అనిపించింది. అయితే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నీతానై (58 బంతుల్లో 88 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రుతురాజ్‌తోపాటు రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్‌), డ్వేన్‌ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

- Advertisement -