ధరణి వార్‌రూమ్‌ని పరిశీలించిన సీఎస్ సోమేశ్‌ కుమార్..

240
dharani war room
- Advertisement -

హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌ పదో అంతస్తులోని ధరణి వెబ్‌సైట్‌ వార్‌ రూమ్‌ను పరిశీలించారు సీఎస్ సోమేశ్‌ కుమార్. ఇప్పటివరకు 63 లక్షల 63 వేల మంది ధరణి పోర్టల్‌ని చూశారని 38 వేల 132 మంది సైన్ ఇన్ అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు ధరణి ద్వారా 4525 రిజస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు.

వార్ రూమ్‌లో వంద మంది సాంకేతిక నిపుణులు సేవలందిస్తారని తెలిపిన సీఎస్…24 గంటలపాటు అందుబాటులో ఉండే ఈ కాల్‌ సెంటర్‌… ధరణి సైట్‌కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తుందని తెలిపారు.

- Advertisement -