బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 62 హైలైట్స్

211
episode 64
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 62 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 62వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి కెప్టెన్‌గా మాస్టర్ ఎంపిక కావడం, మాస్టర్‌ పెట్టిన రూల్స్‌తో హౌస్‌లో రచ్చ రచ్చ,సొహైల్ – మెహబూబ్ మధ్య గొడవతో ఎపిసోడ్‌ ముగిసింది.

తొలుత కిచెన్‌లో అభిజిత్-లాస్యల జోడీ వంట చేస్తుండగా కిచెన్ నీట్‌గా లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది అరియానా. డస్ట్ బిన్‌లో చెత్త వేసేటప్పుడు కనీసం కవర్స్ కూడా వేయడం లేదని మండిపడగా హారికతో కాసేపు వాదనకు దిగాడు అభిజిత్. ఇక కెప్టెన్ పోటీదారులుగా ఎంపికైన అమ్మా రాజశేఖర్, అరియానా, హారికలకు రింగులో రంగు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం కళ్లకు గంతలు కట్టుకుని వైట్ టీషర్ట్స్‌కి రంగులు పూసుకోవాల్సి ఉంటుందని.. ఎవరి వెనుకవైపు తక్కువ రంగు ఉంటే వాళ్లే కెప్టెన్ అవుతారని .. ఈ టాస్క్‌కి సొహైల్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడని తెలిపారు బిగ్ బాస్.

హారికకు అఖిల్, అభిజిత్‌లు డైరెక్షన్ ఇచ్చి పంపించగా.. మాస్టర్‌కి సొహైల్, అవినాష్, మెహబూబ్‌లు సలహాలు ఇచ్చారు. ఇక ఈ రింగులో రంగు టాస్క్‌లో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగగా మాస్టర్‌ తన ప్లాన్‌ను పక్కగా ఇంప్లిమెంట్ చేసి అరియానా,హారికలకు రంగు పూసేశాడు. ఎక్కువ రంగు వీరిద్దరికి అంటడంతో మాస్టర్ విజేతగా నిలిచాడు.

ఇక కెప్టెన్‌గా ఎంపికైన మాస్టర్‌…తాను ఇచ్చిన మాట ప్రకారం అవినాష్‌ని రేషన్ మేనేజర్‌గా నియమించాడు. ఇక జీఆర్బీ నెయ్యి ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటిలో ఇద్దరు సభ్యుల్ని ఎన్నుకుని వాళ్లతో నెయ్యి ఉపయోగించి క్యారెట్ హల్వా చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో లాస్య, మోనాల్‌లను బెస్ట్ కుక్‌లుగా ఎంపికై హల్వా తయారీలో పోటీ పడ్డారు.ఇంటి సభ్యులు అంతా ఏకాభిప్రాయంతో లాస్య, మోనాల్ ఇద్దరూ బాగా చేశారని ఇద్దర్నీ విన్నర్‌గా ప్రకటించారు.

అమ్మా రాజశేఖర్ ఇంటి సభ్యులకు వర్క్ డివైడ్ చేయగా అది రచ్చ రచ్చకు దారి తీసింది. మైక్ మరిచిపోతే జైల్‌లో ఉండాల్సిందే అని.. నిద్ర పోతే ఎక్కడైతే పడుకుంటే అక్కడ వాళ్లే క్లీన్ చేయాలని చెప్పారు. మాస్టర్ చెప్పిన రూల్స్ విని ఇది రీవెంజ్‌లా ఉందని చెప్పాడు అభిజిత్. ఎవరికి ఏం ఇవ్వాలో నాకు తెల్సు.. కెప్టెన్ నేను నువ్వు కాదు.. నువ్వు చెప్పునట్టు నేను ఎందుకు వింటాను అంటూ ఫైర్ అయ్యారు మాస్టర్‌. హారిక,లాస్య, అభిజిత్‌లు ఇంగ్లీష్‌లో ముచ్చట్లు పెట్టగా అభిజిత్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉండటంతో బిగ్ బాస్ నుంచి తెలుగులో మాట్లాడాలని అనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో మాస్టర్‌ తన కెప్టెన్ పవర్ ఉపయోగించి పనీష్‌మెంట్ ఇచ్చాడు.

ఇక తర్వాత మెహబూబ్-సొహైల్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. నీ ఫ్రెండ్ షిప్ నాకు వద్దురా బాబు అని మెహబూబ్ అనడంతో అతనికోసం తీసుకుని వెళ్లిన డ్రై ఫ్రూట్స్ నేలకేసి కొట్టి రచ్చ రచ్చ చేశాడు సొహైల్. ఇక తర్వాత బ్యాటరీస్ పంపినప్పుడు లేట్‌గా వెళ్లి తీసుకునేవాళ్లకి ఎగ్ ఉండదని మాస్టర్ రూల్ పెట్టడంతో బ్యాటరీస్ కోసం పరుగులు పెట్టడం సరదాగా అనిపించింది.

- Advertisement -